Monday, April 29, 2024
- Advertisement -

ఆర్టికల్ 370 విషయంలో అంతర్జాతీయంగా మరో సారి ఒంటరయిన పాక్….

- Advertisement -

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దుపై అంతర్జాతీయంగా పాక్ ఒంటరయ్యింది. జమ్మూ కశ్మీర్‌ విషయంలో నరేంద్ర మోదీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను కట్టడి చేయాల్సిందిగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంతర్జాతీయ సమాజాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయంగా ఏదేశాలు కూడా మద్దతు తెలపకపోవడంతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
ఇదలా ఉంటె తాజాగా రష్యా కూడా ఈ విషయంలో పాక్ బిగ్ షాక్ ఇచ్చింది.

జమ్మూ కశ్మీర్‌‌లో భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, భారీగా సైన్యాన్ని మోహరించిందని ఆరోపిస్తోన్న పాక్.. ప్రపంచ దేశాల మద్దతు కోరే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఐరాస మద్దతు కోరినప్పటికీ.. ఫలితం లేకపోయింది. ఇస్లామిక్ దేశాలు సైతం కశ్మీర్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు.

భారత రాజ్యాంగం పరిధి మేరకే కశ్మీర్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొంది. 1972 సిమ్లా ఒప్పందం, 1999 నాటి లాహోర్ ఒప్పందం ప్రకారం భారత్, పాకిస్థాన్‌లు విబేధాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రస్తుతం రష్యా కూడా భారత్‌కు అండగా నిలవడంతో అంతర్జాతీయ సమాజంలో పాక్‌ ఏకాకిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -