Saturday, May 18, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌కి ఉన్న కమిట్మెంట్ పవన్‌కి కూడా ఉండి ఉంటే అజ్ఙాతవాసి హిట్టయ్యేదిః త్రివిక్రమ్

- Advertisement -

అజ్ఙాతవాసి సినిమా ముందు వరకూ కూడా త్రివిక్రమ్ నుంచి మరీ బ్యాడ్ సినిమా వచ్చింది ఎప్పుడూ లేదు. ఖలేజాలాంటి ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ ఆ సినిమాల్లో కూడా చాలా అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నవే. అజ్ఙాతవాసి కంటే ముందు నితిన్‌లాంటి చిన్న హీరోతో యాభై కోట్ల రేంజ్ బాక్స్ ఆఫీస్ హిట్ సినిమా తీశాడు త్రివిక్రమ్. అయితే అజ్ఙాతవాసి దారుణ వైఫల్యంతో త్రివిక్రమ్ నేం, ఫేం చాలానే డ్యామేజ్ అయింది. అందుకు ఇప్పుడు మరో కారణాన్ని చెప్తున్నాడు త్రివిక్రమ్.

రీసెంట్‌గా ఎన్టీఆర్ జిమ్‌కి వెళ్ళిన త్రివిక్రమ్….. ఎన్టీఆర్ స్లిమ్ లుక్ చూసి స్టన్ అయ్యాడట. ఫేస్‌లో కూడా ఎలాంటి మార్పులు రాకుండా….. హెల్దీగా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ తన బాడీని ఎన్టీఆర్ టోన్ చేసిన విధానం త్రివిక్రమ్‌కి చాలా నచ్చిందట. అజ్ఙాతవాసి సినిమాకు ముందు స్లిమ్ అవ్వాలని చెప్పి పవన్‌కి చాలానే చెప్పాడట త్రివిక్రమ్. అయితే పవన్ మాత్రం మినిమం కేర్ చేయలేదట. తీరా షూట్ స్టార్ట్ అయ్యాక పవన్‌ని సన్నగా చూపించడం……. హ్యాండ్సమ్‌గా చూపించడం కోసమే త్రివిక్రమ్ చాలా ఎక్కువ ఆలోచించాల్సి వచ్చిందట. పవన్ ఫిజిక్‌కి తగ్గట్టుగా చాలా సీన్స్‌ని ఇండోర్‌లో ప్లాన్ చేయాల్సి వచ్చిందట. అందుకే సినిమా అంతా కూడా కేవలం ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఆఫీస్ సెట్లో కంప్లీట్ చేయాల్సి వచ్చిందట. ఇప్పుడు ఇదే విషయాలను షేర్ చేసుకున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ తన ఫిజిక్‌ని టోన్ చేసుకోవడంతో పాటు త్రివిక్రమ్ మార్క్ సింగిల్ లైనర్స్‌ని సూపర్ ఫన్ పండేలా ఎంత ఎఫెక్టివ్‌గా పలకాలో అన్న విషయంపై కూడా స్టడీ చేస్తున్నాడట. డైలాగ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఈ విషయాలన్నీ కూడా త్రివిక్రమ్‌ని చాలా ఇంప్రెస్ చేశాయి. అందుకే ఎన్టీఆర్‌ని తెగపొగిడేస్తున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ స్థాయి కమిట్మెంట్, చిత్తశుద్ధి, హార్డ్ వర్కింగ్ నేచర్ పవన్‌కి కూడా ఉండి ఉంటే అజ్ఙాతవాసి సినిమా అంత దారుణంగా వచ్చేది కాదని…. కానీ పవన్ కళ్యాణ్ తాను ఎప్పుడూ చేసే సీన్స్ చేయడానికే ఇష్టపడడం…….. బాడీ విషయంలో కూడా కనీస స్థాయి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆ ప్రభావం మొత్తం ప్రాజెక్ట్‌పైనే పడిందని చెప్తున్నాడు త్రివిక్రమ్. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం, లేజీనెస్ పుణ్యమాని అజ్ఙాతవాసి సినిమాతో దారుణమైన డిజాస్టర్ ఇచ్చి తన పేరు మొత్తం పోగొట్టుకున్న త్రివిక్రమ్…….ఎన్టీఆర్‌తో మాత్రం తన మార్క్ సూపర్ స్టైలిష్ ఎంటర్టైనర్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానంటున్నాడు. తన స్టామినా ఏంటో మరోసారి ఇండస్ట్రీకి చూపిస్తానంటున్నాడు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని సిక్స్ ప్యాక్‌తో ప్రజెంట్ చేయనున్నాడు త్రివిక్రమ్. అన్నింటికీ మించి ఇప్పటి వరకూ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎప్పుడూ కనిపించనంత అందంగా ఈ సినిమలో కనిపిస్తాడట ఎన్టీఆర్. తన సూపర్ హార్డ్ వర్క్, కమిట్మెంట్‌తో త్రివిక్రమ్‌కి సూపర్ ఇన్‌స్పిరేషన్ ఇచ్చాడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్‌కి త్రివిక్రమ్ ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -