Thursday, May 2, 2024
- Advertisement -

సుజనా చౌదరి బ్లాక్ మెయిలింగ్….. చంద్రబాబునే పావును చేస్తున్నాడా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని 2019 ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీచేస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి పట్టిన గతే టిడిపికి పడుతుందన్న భయం చంద్రబాబుకు పట్టుకుంది. ఎపిలో ఎంపి సీట్లు గెలవనంత మాత్రాన బిజెపికి పోయేది ఏమీ లేదు కానీ 2019అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం లోకేష్‌ని ముఖ్యమంత్రిగా చూడాలని తపన పడుతున్న చంద్రబాబు ఆశలు పూర్తిగా గల్లంతయ్యే ఛాన్స్ ఉంది. 2014ఎన్నికల్లో గెలిచి ఎలా అయినా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న తాపత్రయంలో బోలెడన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న సోనియాగాంధీ మొత్తానికే పార్టీని ముంచేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాడు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ అన్ని విషయాల్లోనూ తప్పులే చేసుకుంటూ వచ్చాడు. కుర్చీపై ఆశతో ఇచ్చిన అబద్ధపు హామీలను నెరవేర్చలేకపోయాడు. ఇక పదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్న పచ్చ శ్రేణులకు దోచుకోవడానికి పూర్తి అవకాశం కల్పించాడు. ప్యాకేజ్ నిధులైతే దోచుకోవచ్చన్న ఉద్ధేశ్యంతో హోదా వద్దని చెప్పి తానే కేంద్రానికి చెప్పి ఒప్పించాడు. పోలవరం ప్రాజెక్ట్ నిధులు కొట్టెయ్యొచ్చని కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్‌ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక అమరావతి తాత్కాలిక భవనాల నిర్మాణంలో చంద్రబాబు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడో వర్షపు లీకేజీలో తేల్చేశాయి. అందుకే దేశంలోనే నంబర్ ఒన్ అవినీతి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రజల్లో తీవ్రస్థాయిలో టిడిపిపై వ్యతిరేకత ఉంది.

అయితే ఆ వ్యతిరేకత మొత్తాన్ని మోడీపైకి నెట్టేసి…… పాపం అంతా మోడీదే అని చెప్పి….. తనపై సానుభూతి వచ్చేలా చేసుకుని 2019ఎన్నికలకు వెళ్దామనుకుంటున్నాడు చంద్రబాబు. అయితే ఈ వ్యవహారానికి 2014 ఎన్నికల ముందు నుంచీ కూడా టిడిపి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సుజనా చౌదరి మోకాలడ్డుతున్నాడని తెలుస్తోంది. వ్యాపారస్థుడు అయిన సుజనాకు బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే బ్యాంకులకు రుణాలు ఎగవేసినప్పటికీ ఏ కేసులూ లేవు. అలాగే సుజనా వ్యాపారాల ఎదుగుదలకు కూడా బిజెపి మంత్రులు పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఉపయోగపడే బిజెపికి దూరం కావడానికి సుజనా చౌదరి రెడీగా లేడట. అలాగే అశోక్ గజపతి రాజు కూడా బిజెపికి దూరం కావొద్దని చెప్తున్నాడట. వ్యాపారస్తులైన ఇతర టిడిపి ఎంపీలది కూడా ఇదే మాట అని తెలుస్తోంది. బిజెపి మంత్రులతో కలిసి వ్యాపారాలు నిర్వహిస్తున్న వీళ్ళు….. బిజెపితో తెగదెంపులకు అస్సలు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. బిజెపితో తెగదెంపులు చేసుకుంటే టిడిపిని విడిచిపెట్టి పూర్తిగా బిజెపిలో చేరిపోతానని సుజనా చౌదరి చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోడీ ప్రధాని కావడం ఖాయమని….. అలాంటప్పుడు మోడీకి దూరమైతే దేశవ్యాప్తంగా ఉన్న వేల కోట్ల వ్యాపారాలు ఏం కావాలని బాబును ప్రశ్నిస్తున్నారట. మోడీతో కలిసే పోటీ చేద్దాం. 2014లో రుణమాఫీలు, ప్రత్యేక హోదా లాంటి హామీలు చూపించినట్టే ఇంకేవైనా పెద్ద హామీలు ప్రజలకు ఇద్దాం. జగన్ అధికారంలోకి వచ్చినా ఇంతకంటే ఏమీ చేయలేడని ప్రచారం చేద్దాం……ఇంకా ఎన్ని వ్యూహాలైనా పన్నుదాం. బిజెపితో తెగదెంపులు చేసుకునే ప్రయత్నం మాత్రం అస్సలు వద్దని….అదే జరిగితే మేం టిడిపికి దూరమై బిజెపిలో చేరతామని…..దేశవ్యాప్త వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబుకు తేల్చి చెప్తున్నారట. ప్రజలు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులకంటే కూడా తన రాజకీయ జీవితం అంతా కూడా వ్యాపారస్తులకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు చంద్రబాబు. ఈ సారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -