Friday, May 17, 2024
- Advertisement -

వ‌చ్చేఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న హీరో సుమ‌న్ ….

- Advertisement -

ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లోకి రావ‌డం సినిమాస్టార్స్ ఎక్కువైపోయింది. గ‌తంలో ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టినుంచి సినిమాస్ట‌ర్స్ రాజ‌కీయాల్లోకి రావ‌డం ఎక్క‌వైపోయింది. రాజ‌కీయా పార్టీలు కూడా సినిమాగ్లామ‌ర్స్‌కోసం ఎగ‌బ‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ సొంత‌పార్టీ పెట్ట‌డం, వాణివిశ్వ‌నాధ్ టీడీపీనుంచి పోటీ చేస్తాన‌న‌డం, మోహ‌న్‌బాబుకూడా 2019 ఎన్నిక‌ల్లో పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు తాజాగా మ‌రో స్టార్ హీరో ఎన్నిక‌ల్లో పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఏపీలోని చంద్రబాబు సర్కారు, తెలంగాణలోని కేసీఆర్ సర్కారు తాను కోరుకున్న విధంగా పలన సాగిస్తే, వారికి మద్దతు పలుకుతానని, ఎన్నికల్లో అనుకూలంగా ప్రచారం చేయడంతో పాటు ప్రత్యక్షంగా బరిలోకి దిగేందుకూ సిద్ధమని నటుడు సుమన్ వ్యాఖ్యానించాడు. , వైద్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో మరింత అభివృద్ధి దిశగా పాలకులు కృషి సాగించాలని ఆయన కోరాడు.

దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ను అందిస్తున్న ఘనత ఒక్క కేసీఆర్ కు మాత్రమే దక్కిందని పొగడ్తలు కురిపించాడు. రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించడం అభినందనీయమని, గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. దివంగత సీఎం వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పేదల్లో భరోసా నింపిందని సుమన్ వ్యాఖ్యానించాడు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపార్టీనుంచి పోటీచేస్తారో క్లారిటీ ఇవ్వ‌లేదు. సుమ‌న్ మాట‌లు చూస్తే టీఆర్ఎస్ త‌రుపునుంచి పోటీ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. చూడాలి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -