Thursday, May 9, 2024
- Advertisement -

వివాదంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి తెలుగు సినిమాలో మంచి పేరుంది, ఆయన కొత్త సినిమా ‘అ .. ఆ’ కోసం జాతీయ స్థాయి ఆర్ట్ దిర్క్టర్ రాజీవన్ ని ఈ సినిమాకోసం తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఫిలిం నగర వార్తల ప్రకారం ఆయన్ని అతి అవమానకరంగా  టాలీవుడ్ నుంచి పంపించేసినట్టు చెప్పుకుంటున్నారు.

అయనని  తీసేసిన తరవాత ప్రకాష్ అనే మరొక ఆర్ట్ డైరెక్టర్ ని రంగంలోకి దింపారు త్రివిక్రమ్. అలా ఒకరిని ఇష్టం వచ్చినట్టు తీసేసి మళ్ళీ వేరేవారిని ఆ స్థానంలో తీసుకోవడం పాజిబుల్ కాదు అంటున్నారు. ఇండస్ట్రీ అన్నాక, కొన్ని పద్దతులు, వ్యవహారాలు వుంటాయి. రాజీవన్ నుంచి ఎన్ వో సీ లేకుండా ప్రకాష్ పనిలోకి దిగడం అసాధ్యం. రాజీవన్ కు ఇంతోటి ఈ సినిమా నుంచి తప్పుకోవడం పెద్ద విషయం కాదు.

ఆయనకి  జాతీయ స్థాయి లో పేరు ప్రతిష్టలు చాలా ఎక్కువగా ఉన్నాయి. త్రివిక్రమ్ సరిగా కారణం కూడా చెప్పలేదు అనేది ఇక్కడ పెద్ద వాదన.త్రివిక్రమ్ కనీసం ఫోన్ లు కూడా ఆన్సర్ చెయ్యడంలేదట. ఈ విషయంలో నిర్మాత రాధాకృష్ణ మధ్యలో నలిగిపోతున్నారు. ఒక గౌరవమైన టెక్నీషియన్ ని త్రివిక్రమ్ ఇలా ట్రీట్ చెయ్యడం చాలా ప్రశ్నలు లేపుతోంది. త్రివిక్రమ్ నిజానికి గొప్ప డైరెక్టర్ కానీ ఆయన ఇలా ఒదిగి ఉండకుండా ఉండడం కొత్త గా అనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -