Monday, May 13, 2024
- Advertisement -

కెసిఆర్ ‘గుట్టు’ విప్పుతా అంటున్న సర్వే, అసలేంటా గుట్టు ?

- Advertisement -

రాజకీయాలలో కొందరు రాజకీయ నాయకులు భలే వింతగా మాట్లాడతారు. కొందరు నాయకుల గురించి ప్రస్తావిస్తూ ఆ వ్యక్తికి సంబంధించిన “సీక్రెట్” తన దగ్గర ఉంది అని, ఎప్పుడు బయటపెట్టాలో చూసి అప్పుడు బయటపెడతాను అని వారు అంటూ ఉంటారు. ఈ విషయం గనక బయటపడితే వారికి అసలు భవిష్యత్తు కూడా ఉండదు అన్న చందంగా మాట్లాడుతూ ఉంటారువారు.

వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా సర్వే సత్యనారాయణ కూడా ఇలాగే మాట్లాడుతున్నారు .చూసారుగా పేరులోనే సర్వే ఉంది ఇంకేం ఆయన గారు తిరుగులేకుండా సర్వే లు చేసి మరీ అందరి గుట్టూ బయటపెట్టడం లో సిద్దం హస్తులు అన్న మాట. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ విషయంలో చాలా నిజాలు బయటకి చెబుతానని ఆయన ప్రగల్భాలు పలుకుతున్నారు.

మహా అయితే కెసిఆర్ పూర్వీకులు ఉత్తరాంధ్రాకి చెందినవారు అని ఆయన బయటపెట్టచ్చు అది అప్పట్లో ఉద్యమసమయంలోనే జరిగిన పరిణామం, ఇది పెద్ద వింతేమీ కాదు. పోనీ ఎవ్వరికీ తెలియని గుట్టు ఏమైనా ఉంటే ఎన్నికకు ముందే బయటపెడితే అది కాంగ్రెసుకు కలిసిరావచ్చు. వారం రోజుల తర్వాత బయటపెట్టే సమయానికి ఎన్నిక ముగుస్తుంది. అప్పుడు బయటపెడితే ఏం ప్రయోజనం? అంటే కేసీఆర్గుట్టు ఏమిటో వివరాలు సేకరించి బయటపెడతాడా? సర్వే సత్యనారాయణ స్థానికుడు కాడని టీఆర్ఎస్నాయకులు ప్రచారం చేస్తున్నారు.

ఇది ఆయనకు ఒళ్లు మండిస్తోంది. అందుకే కేసీఆర్ఎక్కడివాడో, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో చెబుతానని అంటున్నారు కాబోలు. సర్వే బయటపెట్టాలి అనుకుంటున్నా గుట్టులో ఏమీ ఉండక పోవచ్చు. పొట్టకూటి కోసం వలసలు వెళ్ళేవారు ఎందఱో ఉన్నారు ఆ రకంగా తెలంగాణా వారు ఆంద్రాకి వెళ్ళడం ఆంధ్రా వారు తెలంగాణాకి రావడం ఇదంతా మామూలే . కెసిఆర్ ఎక్కడి వారు ఎక్కడ పుట్టారు ఇలాంటి కహానీలకి కాలం చెల్లింది చెప్పినా ఎవడూ నమ్మడూ పట్టించుకోడు. ప్రస్తుతం కెసిఆర్ తెలంగాణా నాయకుడు మాత్రమే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -