Monday, May 13, 2024
- Advertisement -

ఆయన రూటే సెపరేటు

- Advertisement -

అలాంటి రాజకీయాలు అందరికీ సాధ్యం కావు. ఆయన వేసే ఎత్తులూ ఎవరికీ అర్థం కావు. అంతటి విలక్షణ రాజకీయ నాయకుడు కాబట్టే… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అధికారాన్ని తన సొంతం చేసుకున్నారు. ఇప్పుడు.. వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా తన మార్క్ చూపించుకున్నారు.

పార్టీ తరఫున అభ్యర్థిని నిలపాలని కేడర్ నుంచి ఒత్తిడి వచ్చినా… రిస్క్ ఎందుకన్న ఆలోచనతో బాబు లైట్ తీసుకోవడం చూస్తే… ఇదంతా బాబు మార్క్ రాజకీయంగానే కనిపిస్తోంది. అందుకే.. బీజేపీకి మద్దతిచ్చి… పార్టీ తెలంగాణ శాఖ ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు అప్పజెప్పి సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. ఇలా ఎందుకు అని ప్రశ్నించే వాళ్లకు కొన్ని కారణాలు సమాధానంగా కనిపిస్తున్నాయి.విభజన జరిగి ఇంకా రెండేళ్లు కూడా కాలేదు. అంతలోనే ఉప ఎన్నిక రావడంతో… పార్టీ ఫ్యూచర్ పై ఎందుకు ప్రయోగం చేయాలనుకోవడం ఓ కారణం.

బీజేపీకి అవకాశం ఇచ్చిన క్రెడిట్ మెడీ దగ్గర సొంతం చేసుకోగలగడం మరో కారణం. ఇంత ప్రచారం జరుగుతున్నా.. ఎక్కడా అటెండ్ కాకుండా… తన పార్టీ నేతలను పంపిన చంద్రబాబు… ఒక వేళ బీజేపీ గెలిస్తే ఆ ఘనత అంతా టీడీపీదే అని ప్రచారం చేసుకునే అవకాశం ఉండడం ఇంకో కారణం. అది కాకుండా బీజేపీ ఓడిపోతే… మామూలుగానే బీజేపీ నేతల వైఫల్యంగా చూపే చాన్స్ ఎలాగూ సేఫ్ సైడ్ గా ఉండొచ్చన్నది నాలుగో కారణం.

ఇలా ఆలోచిస్తూ పోతే.. బాబుగారి స్టయిల్ లో.. మనకు చాలా రీజన్సే కనిపిస్తున్నాయి.అందుకే.. చిక్కడు దొరకడు అన్నట్టు.. అంతా తెర వెనక నుంచే నడిపిస్తున్న బాబుగారి రాజకీయ తెలివి తేటలను చూసి.. అంతా ఆయన రూటే సెపరేటు అనుకుంటున్నారు. అసలైన సేఫ్ గేమ్ అంటే ఇదే కదా మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -