Monday, May 20, 2024
- Advertisement -

అల్లూ అర్జున్ – మాటల మాంత్రికుడి మూడవ సినిమ

- Advertisement -

ప్రతీ సినిమా ఇండస్ట్రీ కీ కొన్ని హిట్  – సూపర్ హిట్ కాంబినేషన్ లు ఉంటాయి. అంచనాలు ఆ కాంబినేషన్ ల బట్టీ డబల్ ట్రిపుల్ అవుతూ ఉంటాయి. రెండు సూపర్ హిట్ లు ఇచ్చిన దర్శక – హీరోలు ఇప్పుడు మళ్ళీ మూడవ సినిమా కోసం జత కట్టబోతున్నారు అని తెలుస్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ బన్నీ ల కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి ,సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు చెరొక యాభై , అరవై కోట్ల మార్క్ ని దాటేసాయి కూడా. వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా రాబోతోంది అంటున్నారు విశ్లేషకులు. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘సరైనోడు’ సినిమాతో బిజీగా ఉంటే, త్రివిక్రమ్ ‘అ..ఆ’సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ఎప్రిల్ లో రిలీజ్ అవుతాయి. ఆ సినిమాల తర్వాత వీరిద్దరికీ వేరు వేరు కమిట్ మెంట్స్ ఉన్నప్పటికీ, అవి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోందట. అందుకే వీరిద్దరూ ఈ గ్యాప్లో ఓ సినిమా చేసేద్దాం అనే ఆలోచనలో ఉన్నారట. మరీ అన్నీ అనుకుంటున్నట్టు జరిగితే వీరిద్దరి కాంబినేషన్లో ఈ ఏడాదే ఓ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -