Friday, April 26, 2024
- Advertisement -

ఫేస్ బుక్ మొఖం మాడిపోయింది

- Advertisement -

‘ఫ్రీ ఫ్రీ ఫ్రీ ‘ ఫ్రీ అంటే చాలు మన దేశం లో దేన్నైనా నడిపెయచ్చు అనుకున్నాడు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్. ఫేస్ బుక్ లో ఫ్రీ బేసిక్స్ అంటూ మొదలు పెట్టిన ఈయన ని భారత టెలీకాం నియంత్రణ సంస్థ – ట్రాయ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది.

ఉచితం పేరుతో మొత్తం ఇంటర్నెట్ మీద గుత్తాధిపత్యం కోసం మార్క్ ఈ పని చేస్తున్నాడు అంటూ పలురకాల స్వచ్చంద సంస్థలు ఉద్యమించిన నేపధ్యంలో ట్రాయ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది . నెట్ న్యూట్రాలిటీ విషయంలో తాము తగ్గం అనీ అది ఉండాల్సిందే అంటూ స్పష్టం చేసింది ఈ సంస్థ. సమాన పరిణామం లో ఉన్న డేటా వినియోగం విషయంలో ఈ టెలీకాం సంస్థ కాస్త గట్టిగానే వ్యవహరించింది. ఇంటర్నెట్ లో వినియోగదారులకు వేర్వేరు ధరలను నిర్ణయించే పద్ధతికి స్వస్తి చెప్పాలని ట్రాయ్ ఆదేశించింది. దీంతో ఎయిర్ టెల్ జీరో – ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొన్నాళ్ళు గా ఫేస్ బుక్ వారికీ – ట్రాయ్ కీ మధ్య పెద్ద వివాదం చెలరేగింది. తన ఫ్రీ బేసిక్స్ ఫ్లాట్ ఫారం కి మద్దతు కూడగట్టుకోవడం కోసం మార్క్ చాలా ప్రయత్నాలు చేసాడు. ఒక అప్లికేషన్ ని సేవ్ చేసుకోవాలి అంటూ వినియోగదారులని కోరింది కూడా.

ట్రాయ్ ఈ మేరకు అన్నీ పరిశీలించి ఇది కుదరదు అని చెప్పేసింది. తమ ఆదేశాలు తప్పు దోవ పట్టిస్తే గనక రోజు కి యాభై వేల నుంచీ యాభై లక్షల వరకూ జరిమానా విధిస్తాం అంటూ హెచ్చరించింది. ఎంతమంది వినియోగదారులు గుడ్డిగా ఫేస్ బుక్ మాయలో పడినా వారిని ట్రాయ్ కాపాడింది అంటున్నారు విశ్లేషకులు. ఈ దెబ్బతో మార్క్ జుకర్ బర్గ్ చాలా ఆవేశంగా తన ప్రొఫైల్ లో ఒక భారీ పోస్ట్ పెట్టాడు.ఎలాగైనా భరత్ లో ఫ్రీ బేసిక్స్ ని సాధిస్తాం అన్నాడు అతను. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -