Sunday, April 28, 2024
- Advertisement -

మంచు విష్ణును వెంటాడుతున్న ట్రోల్స్ .. ఇక కష్టమే !

- Advertisement -

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఉండే క్రేజే వేరు.. మోహన్ బాబు మొదలుకొని ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్, అలాగే ఆయన కూతురు మంచు లక్ష్మి.. ఎవరికి వారు వారి ప్రత్యేకతను చాటుకుంటూ కెరియర్ లో ముందుకు సాగుతున్నారు. అయితే మంచు ఫ్యామిలీ చేసే కామెంట్స్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ గానే నిలుస్తుంటాయి. ముఖ్యంగా వారు చేసే కామెంట్స్ విపరీతంగా ట్రోలింగ్ కు గురి అవుతూ ఉంటాయి.

దాంతో మంచు ఫ్యామిలీ నుంచి మూవీ వస్తుందంటే సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తో రెచ్చిపోతుంటారు నెటిజన్స్. ఇక ఆ మద్య మోహన్ బాబు చాలా కాలం తరువాత సోలోగా నటించిన ” సన్నాఫ్ ఇండియా ” మూవీపై ట్రోల్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. దాంతో మూవీ కలెక్షన్ పై ట్రోలింగ్ దెబ్బ గట్టిగానే పడింది. ఇక తాజా మంచు విష్ణును ఈ ట్రోలింగ్ దెబ్బ గట్టిగానే తాకింది. అయితే మొదటి నుంచి కూడా మంచు విష్ణుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మీమ్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇక తాజాగా ఆయన నటించిన జిన్నా ఇటీవల ప్రేక్షకుల ముదుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్ రోజు మూవీ కాస్త పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికి..మూవీ విపరీతమైన ట్రోల్స్ కు గురి కావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. తీరా సెకండ్ డే కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించినట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. దీంతో మూవీ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మంచు విష్ణు ఖాతాలో మరో భారీ ఫ్లాప్ గా ” జిన్నా ” నిలిచే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి ట్రోలింగ్ దెబ్బతో మంచు ఫ్యామిలీ కుదేలవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -