Saturday, May 18, 2024
- Advertisement -

అత్యాచారాలు జరిగినప్పుడు.. మహిళా కమిషన్ ఎక్కడ ? జనసేన సూటి ప్రశ్నలు !

- Advertisement -

వైసీపీ వర్సస్ జనసేన మద్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇరు పార్టీల మద్య ఈ నెల 15 మొదలైన ఈ పరస్పర విమర్శల దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు లేని విధంగా పవన్ వైసీపీ నేతపై భూతులతో విరుచుకూపడడం.. పవన్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కూడా అంతే స్థాయిలో కౌంటర్లు వేయడంతో ఏపీ చుట్టూ రాజకీయ వేడి అలుముకుంది. ఇక సి‌ఎం జగన్ కూడా పవన్ వ్యాఖ్యలపై కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంచితే పవన్ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని.. ఏపీ మహిళా కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. మహిళలను ” స్టేపినీలు.. ” అనడం అనిర్వచనీయం అని, వెంటనే పవన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా కమిషన్ చైర్మెన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.

ఇక మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై జనసేన కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యింది.. అత్యాచారాలు జరిగినప్పుడు, వైసీపీ నేతలు అడ్డగోలుగా మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుంది ? అంటూ సూటిగా ప్రశించింది. ఈ మేరకు ట్విట్టర్లో 18 పాయింట్స్ గా ట్విట్స్ చేస్తూ.. వైసీపీ నేతలు మహిళలను ఎలా కించపరిచారో వివరిస్తూ అప్పుడు మహిళా కమిషన్ ఎక్కడ ? అంటూ ప్రశ్నలు సంధించింది.

” అత్యాచారాలకు జరగడానికి తల్లి లోపమే అని హోమ్ మంత్రి అన్నప్పుడు.. మాతృమూర్తులను అవమానించడం కదా ? అప్పుడు మహిళా కమిషన్ ఏమైంది ?, ” రెండు మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి.. వాటికే గోల చేయాలా ? అంటూ మంత్రి పదవిలో ఉన్న మహిళా వ్యాఖ్యానించినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడ ?, ఎంపీ హోదాలో ఉంటూ అసభ్యకరంగా వీడియో కాల్ లో మాట్లాడిన.. ఎంపీ ని వెనకేసుకొచ్చినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడ ? .. అంటూ.. ఇక దాదాపుగా 15 ప్రశ్నలను మహిళా కమిషన్ కు సంధిచింది జనసేన పార్టీ. మరి జనసేన సంధించిన ప్రశ్నలకు మహిళ కమిషన్ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -