Saturday, May 4, 2024
- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా ?

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నేషనల్ వైడ్ గా భారీ అభిమానులను సంపాధించుకొని నేషనల్ స్టార్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద చక్రం తిప్పుతున్నాడు. ప్రభాస్ మూవీ వస్తోందంటే.. బాలీవుడ్ బడా హీరోలు సైతం వారి మూవీస్ ను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మూవీస్ అన్నీ భారీ సినిమాలే కావడం విశేషం. ముఖ్యంగా ” సలార్ ” , ఆది పురుష్ “, ప్రాజెక్ట్ కే ” వంటి మూవీస్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ విషయం అలా ఉంచితే ఈ నెల 23 పుట్టిన రోజు కావడంతో తమ అభిమాన హీరో బర్త్ డే ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అభిమానులు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. .

అయితే ఈ సారి తన బర్త్ డే సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండాలని ప్రభాస్ భావిస్తున్నాడట. ఎందుకంటే ఇటీవల తన పెదనాన్న కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ప్రభాస్ కూడా నార్మల్ కావడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే ఈసారి తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాట్లు టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్. దాంతో అభిమానులు కూడా ప్రభాస్ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే అవకాశం లేదు. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అప్ కమింగ్ మూవీస్ కు సమబంధించి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాజెక్ట్ కే మూవీకి సంబంధించి స్మాల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చారు. అలాగే సలార్, ఆది పురుష్ మూవీస్ కు సంబంధించి కూడా ఏమైనా అప్డేట్ ఎస్తారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

చరణ్- అర్జున్ తో భారీ మల్టీ స్టారర్..

బాస్ వస్తుండు.. గెట్ రెడీ !

రామ్ చరణ్ పై ప్రయోగం చేస్తోన్న శంకర్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -