Wednesday, May 15, 2024
- Advertisement -

మహేష్ సినిమాని అవమానించాడు!

- Advertisement -

మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద భారీ ప్లాప్ గా నిలిచింది. ఈ చిత్రం ప్లాప్ కావడంతో నిర్మాతకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. అయితే ఈ బ్రహ్మోత్సవం సినిమా కంటే ఇటివలే తెలుగులోకి డబ్బింగ్ చిత్రంగా వచ్చిన బిచ్చగాడు సినిమా చాలా బాగుందని మహేష్ చిత్రాన్ని అవమానించాడు తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.

ఇటివలే బ్రహ్మోత్సవం చిత్రం కంటే ముందు బిచ్చగాడు చిత్రం విడుదల అయింది. కాకపోతే సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్లే ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో మహేష్ నటించిన బ్రహ్మోత్సవం విడుదలైంది. దాంతో ఆ చిత్రాన్ని చూడటం కోసం ఎమ్మెల్యే రసమయి క్యూ లో నిల్చొని మరీ టికెట్ కొని సినిమా చూసాడట. సినిమా చూసి కళ్ళు బైర్లు కమ్మాయట దాంతో వచ్చేసాడట.

ఇక బిచ్చగాడు చూసి షాక్ అయ్యాడట. సినిమా లో దమ్ము ఉంటే సరిపోతుంది. సినిమాలో స్టార్స్ అవసరం లేదని కథ లో మంచి కంటెంట్ ఉంటే చాలు అని బిచ్చగాడు నిరూపించదని దానికి కితాబు నిస్తూ మహేష్ చిత్రాన్ని అవమానించాడు. ఇలా ఎమ్మెల్యే మహేష్ సినిమాపై కామెంట్స్ చేయడం వల్ల మహేష్ ఫ్యాన్స్ ఆ ఎమ్మెల్యే పై చాలా కోపం గా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -