Thursday, May 2, 2024
- Advertisement -

ఎక్కువ సేపు పని చేస్తే అనారోగ్యమట

- Advertisement -

కాలం మారుతోంది. కాలానికి తగ్గట్టు బాధ్యతలు, ఉద్యోగాల తీరులోనూ మార్పు వస్తోంది. అన్ని రంగాల్లో మహిళల పాత్ర కూడా కీలకంగా మారుతోంది. ఓ వైపు ఇంటి పనులు చక్కబెట్టుకోవడంతో పాటు.. మరోవైపు ఉద్యోగ బాధ్యతల్లో కూడా స్త్రీలు ప్రతి రంగంలో ఆధిపత్యం చూపిస్తున్నారు. ఇటు ఆఫీస్ లో.. అటు ఇంట్లో.. సమయానికి మించి పని చేస్తున్న కారణంతో.. మహిళలకు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్టు రీసెంట్ గా ఓ అంతర్జాతీయ సర్వేలో తేలింది.

వారానికి 60 గంటలకు మించి పని చేసే మహిళల్లో.. డయాబెటిస్, కేన్సర్, గుండె సంబంధ జబ్బులు వచ్చే అవకాశాలు పెరిగాయని.. ఓహియో స్టేట్ యూనివర్సిటీ సర్వేలో తేలింది. ఎక్కువగా పని చేసే మహిళల్లో.. 40 నుంచి 50 ఏళ్ల వయసు దాటగానే.. ఆరోగ్య సమస్యల ప్రభావం తీవ్రం కావడం మొదలవుతున్నట్టు బయటపడింది. 32 ఏళ్లకు పైబడిన 7 వేల 500 మంది మహిళల జీవన విధానాలు, రోజు వారీ కార్యక్రమాలపై పూర్తి వివరాలు సేకరించాకే.. ఈ ఫలితాలు బయటపడినట్టు సర్వే నిర్వాహకులు అనౌన్స్ చేశారు.

సో.. ఇంటిని, ఆఫీస్ ను చక్కబెట్టాలని సామర్థ్యానికి మించి మహిళలు పని చేస్తే ఒత్తిడి ఎదుర్కోవడం ఖాయమని.. నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటేనే.. భవిష్యత్తు కూడా బాగుంటుందని సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -