- Advertisement -

గబ్బర్ సింగ్ -2 నుంచి వాళ్లిద్దరూ బయటకు!

- Advertisement -

ఒకవైపు పవన్ కల్యాన్ ప్రతిష్టాత్మక సినిమా గబ్బర్ సింగ్ -2 శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నా.. ఈ సినిమాకు సంబంధించి మార్పులు మాత్రం తప్పడం లేదు. చాన్నాళ్ల పాటు ఊరించి చివరకు పట్టాలు ఎక్కిన ఈ సినమా విషయంలో మార్పు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఈ సినిమా హీరోయిన్ మారిపోవడం ఖాయం అయ్యింది. మొదటగా దీనికి అనిషా ఆంబ్రోస్ ను హీరోయిన్ గా అనుకొన్నారు.

పవర్ స్టార్ పక్కన ఆమె హీరోయిన్ గా ఖాయం అయ్యింది. అయితేఇప్పుడేమైందో ఏమో కానీ.. ఈప్రాజెక్టు నుంచి ఆమె ను తప్పించినట్టుగా తెలుస్తోంది. ఆమె బదులు మరో హీరోయిన్ వేటలో ఉందట రెండో గబ్బర్ సింగ్ యూనిట్. మరి తీరా సినిమా ప్రారంభం అయ్యాకా.. హీరోయిన్ మార్పు అండే విడ్డూరమే.

ఇక ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన ఆనంద్ సాయి కూడా తప్పుకొన్నాడు. డేట్స్ ఇబ్బందితో ఆయన బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ బాధ్యతలను బ్రహ్మ కడలికి అప్పగించినట్టుగా సమాచారం. మరి ఇలా మార్పులు చేసుకొంటూ పోతే.. ఈ సినిమా ఎప్పటికి రెడీ అవుతుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -