Wednesday, May 22, 2024
- Advertisement -

గవర్నర్ ఉన్నది అవినీతి వ్యవహారాలను సెటిల్ చేసేందుకేనా?!

- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబులను పిలిపించుకొని మాట్లాడనున్నాడట గవర్నర్ నరసింహన్.

మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించి ప్రజలు ఇన్ వాల్వ్ అయిన సమస్యల గురించి మాట్లాడటానికి నరసింహన్ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసి ఉంటే అదో ముచ్చట. అయితే ఇప్పుడు ఉభయ రాష్ట్రాల గవర్నర్ గారు.. రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం అవుతున్నది ప్రజా సమస్యల విషయం లో కాదు!

వారి మధ్య తలెత్తిన రాజకీయ వివాదాలను సెటిల్ చేయడానికి!

అవినీతి వ్యవహారాన్ని సెటిల్ చేయడానికి. ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం, తెలంగాణ సీఎంల మధ్య రాజీని కుదర్చడానికి ప్రయత్నిస్తున్నాడట నరసింహన్. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయమని గవర్నర్ ముఖ్యమంత్రులిద్దరికీ సూచించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఊరికే వివాదాలు చేసుకోవద్దు. .ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయండి అని గవర్నర్ సూచిస్తారట. ఇద్దరూ పరువు పోగొట్టుకోవద్దని పెద్దమనిషిలా నరసింహన్ సూచించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరి ఓటుకు నోటు కుంభకోణం కథేమిటో అందరికీ తెలసిందే. కోట్ల రూపాయలు ఖర్చ పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలే చేసే యత్నమిది అని అందరికీ అర్థం అయ్యింది. దీనిపై విచారణ జరిగి.. దోషుల కు శిక్ష పడాలని ప్రజలంతా కోరుకొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు గవర్నర్ ఈ వ్యవహారంలోకి జోక్యం చేసుకొని.. అవినీతి వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించడం నిజంగా విడ్డూరమే. మరి గవర్నర్ ఉన్నది ఇందుకేనా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -