Thursday, May 2, 2024
- Advertisement -

తమన్నాకు గిఫ్ట్ ఇచ్చిన చరణ్ భార్య.. అదేంటంటే ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం ’సైరా నరసింహ రెడ్డి’. రిలీజ్ రోజే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. సెలబ్రిటిలు సైతం ఈ సినిమా చూసి ఫిదా అవుతున్నారు. ఇప్పటికే కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకెళ్తుంది. ఇక వీకెండ్ లో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ చాలానే ఉంది. ఇక ఈ చిత్రంలో తమన్నా ఒక కథనాయికగా నటించిన విషయం తెలిసిందే. నరసింహరెడ్డి ప్రియురాలుగా ఆమె నటించి అందరి చేత ప్రశంసలు అందుకుంది.

’సైరా’ టైటిల్ సాంగ్ లో తమన్నా చేసే డ్యాన్స్, ఆమె పలికించిన హావభావాలు సినిమా చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. తమన్నాకు ఏ సినిమాకు రానంతా పేరు ఈ సినిమాతో వచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. అయితే తమన్నా పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి చరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడట. దాంతో చరణ్ భార్య ఉపాసన ఒక ఖరీదైన ఉంగరాన్ని తమన్నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఉపసన ఈ విషయంను తన ట్విట్టర్ లో తెలిపింది.

తమన్నా ఆ రింగ్ ను ధరించిన ఫోటోను పోస్ట్ చేసిన ఉపసన ” నిర్మాత సతీమణి నుంచి సూపర్ తమన్నాకు ఓ బహుమతి. అప్పుడే నిన్ను మిస్ అవుతున్నాం. త్వరలో కలుద్దాం. #సైరా నరసింహారెడ్డి” అంటూ ట్వీట్ చేశారు. తమన్నా సినీ పరిశ్రమకు వచ్చి దాదాపుగా పదిహేను సంవత్సరాలు అయింది. దాదాపు అవకాశాలు తగ్గుతున్నాయి అనే టైంలో ఎఫ్ 2 సినిమాతో హిట్ కొట్టింది. ఇప్పుడు సైరా తో మరో హిట్ దక్కించుకుని.. వరస సినిమాలతో దూసుకెళ్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -