Tuesday, May 14, 2024
- Advertisement -

టీమిండియా కోలుకోవ‌డం క‌ష్టం

- Advertisement -

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 72 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగ‌తి తెలిసిందే.మొద‌టి టెస్ట్‌లో ఓడిపోయిన ఇండియా కోలుకోవ‌డం క‌ష్టం అని టీం ఇండియా మాజీ ప్లేయ‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. విజ‌యావ‌కాశాలు ఉన్నా ఇండియా పోరాడ‌కుండా చేతులు ఎత్తేసింది అని సెహ్వాగ్ అభిప్రాయ ప‌డ్డాడు.

ఈ టెస్టు సిరీస్‌లో భారత్‌ విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డాడు. టెస్టు సిరీస్‌లో భారత్‌ తిరిగి పుంజుకునే అవకాశం కేవలం 30 శాతం మాత్రమే ఉందని సెహ్వాగ్‌ స్పష్టం చేశాడు.’టీమిండియా ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే గాడిలో పడటం చాలా కష్టం. విరాట్‌ సేన బరిలో నిలబడటానికి 30 శాతం ఛాన్స్‌ మాత్రం ఉంది. సెంచూరియన్‌లో జరిగే రెండో టెస్టుకు అజింక్యా రహానే తుది జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్‌ బలం పెరగడంతో పాటు ఆత్మవిశ్వాసంతో కూడా పెరుగుతుంది.అదే సమయంలో నలుగురు స్పెషలిస్టు బౌలర్లు కూడా అవసరం. భారత్‌ జట్టు విజయం సాధించాలనుకుంటే మాత్రం కోహ్లి బ్యాట్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు అవసరం’ అని సెహ్వాగ్‌ విశ్లేషించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -