Friday, May 3, 2024
- Advertisement -

ఐ లవ్ యు’ అనబోతున్న ఉపేంద్ర

- Advertisement -

గత కొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఉపేంద్ర మళ్లీ హీరోగా సినిమాలు మొదలుపెట్టారు. తాజాగా ఉపేంద్ర హీరోగా నటించిన ఒక సినిమాని ఇప్పుడు తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. గతంలో ‘ఓం’, ‘ఏ’, ‘సూపర్’ సినిమాలలో హీరోగా నటించిన ఉపేంద్ర, అల్లు అర్జున్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో ముఖ్యపాత్ర పోషించారు. తాజాగా ఉపేంద్ర నటించిన ‘ఐలవ్యూ’ అనే సినిమా ఇప్పుడు కన్నడ లో మాత్రమే కాక తెలుగు లో ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతోంది.

‘నన్నే ప్రేమించు’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా విడుదల కాబోతోంది. రచితా రామ్‌ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన చంద్రు ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాక శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్ పతాకంపై నిర్మించారు కూడా. ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఉపేంద్ర తెలుగు లో హీరో గా కనిపించి చాలా కాలం అయింది. మరి ఈ సినిమా తో ఉపేంద్ర మంచి విజయాన్ని సాధిస్తారో లేదో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -