Saturday, April 27, 2024
- Advertisement -

ట్రెండింగ్‌లో పవన్..’ఉస్తాద్ భగత్ సింగ్’

- Advertisement -

చెప్పినట్లుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. భగత్స్ బ్లేజ్ టీజర్‌ని రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఈ టీజర్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లో మారింది. టీజర్‌లో ముఖ్యంగా గాజు ప‌గ‌లే కొద్దీ ప‌దునెక్కుద్ది.. గ్లాసంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. పవర్ ప్యాక్డ్ అవతారంలో పవన్ కనిపించగా పంచ్ డైలాగులు ఆకట్టుకున్నాయి. టీజర్‌లో పవన్ కళ్యాణ్ గన్స్ ఫైర్ చేయడం మెస్మరైజింగ్‌గా ఉండగా శ్రీలీల టీజర్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చారు.

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ సూపర్బ్‌గా ఉండగా నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమా స్టంట్స్ ని రామ్-లక్ష్మణ్ ద్వయం సమకూరుస్తున్నారు. త్వరలో రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -