డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా నిరూపించుకున్న దర్శకుడు మలినేని గోపీచంద్ బాలకష్ణ తో 107వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా శతిహాసన్ నటిస్తుంది. సంగీతాన్ని తమన్ అందిస్తుండగా, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడు.
త్వరలోనే పట్టాలకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నారు. ప్రతినాయకుడి పాత్రను కన్నడ స్టార్ దునియా విజయ్ పోషిస్తున్నాట్టు ఇటీవలే ప్రకటించారు. ఆ స్థాయికి ఎంతమాత్రం తగ్గకుండా లేడీ విలన్ పాత్రలకి తమిళనాట తిరుగులేని విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ తీసుకున్నారు. సెట్స్ పైకి ఆమెకు ఆహ్వానం పలుకుతూ సంబందించిన పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

రాయలసీమకు చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో బాలయ్య మార్క్‌తో యాక్షన్ సీన్లను గోపీచంద్ ప్లాన్ చేశాడట.అఖండ సినిమా బ్లాక్ బస్టర్ తరువాత బాలకృష్ణ, క్రాక్ సినిమా సూపర్ హిట్ తరువాత గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి పెరుగుతూ పోతోంది.
హై అలర్ట్ .. థర్డ్ వేవ్ వచ్చేసింది