Friday, May 17, 2024
- Advertisement -

సల్మాన్ బ‌యోపిక్‌లో ఎవ‌రు న‌టించ‌రు

- Advertisement -

సల్మాన్ ఖాన్ జైలు నుండి బ‌య‌ట‌కివ‌చ్చాడు. స‌ల్మాన్ ప‌రామ‌ర్శించ‌డానికి బాలీవుడ్ మొత్తం అత‌ని ఇంటికి క్యూ క‌ట్టింది.అందులో కుర్ర హీరో వ‌రుణ్ ధావ‌న్ కూడా ఒక‌రు. అత‌ను స‌ల్మాన్ చాలా దగ్గ‌ర‌గా ఉంటారు. మంచి స్నేహితులు కూడా.సల్మాన్‌ నటించిన ‘జుడ్వా’ సినిమా రీమేక్‌లో వరుణ్ ధావన్‌ నటించాడు. ఆ తర్వాత వీరి స్నేహం మరింత బలపడింది. బాలీవుడ్‌లో సల్మాన్‌ బయోపిక్‌పై చర్చలు జరుగుతున్నాయి.దీని గురించి మీడియా వరుణ్‌ ధావన్‌ను ప్రశ్నించగా..సల్మాన్ ఇంకా చిన్నవాడు అత‌ని జీవితంపై అప్పుడే బ‌యోపిక్ తీయ‌డం ఏంటీ అని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు.

ఒకవేళ బయోపిక్‌ తీసినా ఆయన పాత్రలో నటించడానికి మరొకరు సరిపోరని ఆయనే నటించాలని తెలిపాడు.కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కు జోధ్‌పూర్‌ న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. రెండు రోజులు జైల్లో గడిపిన సల్మాన్‌కు శనివారం బెయిల్‌ లభించింది. దాంతో వచ్చే వారం నుంచి ఆయన సినిమా షూటింగ్‌ల‌లో పాల్గొననున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -