Friday, March 29, 2024
- Advertisement -

పూజా హెగ్డే పాటకు రష్మిక రచ్చ రచ్చ

- Advertisement -

స్టార్ హీరోయిన్ల మధ్య వృత్తిపరమైన పోటీ సహజం. కొందరైతే ప్రొషెనల్‌ లైఫ్‌ తో సంబంధం లేకుండా తోటి నటిమణులతో స్నేహంగా ఉంటూ ఉంటారు. ఒకరినొకరు అభినందించుకోవడం లాంటివి చేస్తూ ఉండటం చూస్తూ ఉంటాం. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సాంగ్‌కు మరో స్టార్ హీరోయిన్ డ్యాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం బీస్ట్.

ఈ సినిమా సాంగ్ అరబిక్ కుత్తు రిలీజై యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన సాంగ్లో స్టెఫ్టులతో విజయ్, పూజా అదరగొట్టారు. ఇప్పటికే ఈ పాటకు సమంత, కీర్తి సురేశ్ స్టెప్స్ వేయడం విశేషం.

తాజాగా మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సైతం బాలీవుడ్ యువనటుడు వరుణ్ ధావన్‌తో కలిసి ‘అరబిక్ కుత్తు’ సాంగ్‌కు స్టెప్స్ వేసింది. వరుణ్ ధావన్‌ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి హిందీలో నటించిన ‘మిషన్ మజ్ఞు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -