Friday, March 29, 2024
- Advertisement -

మళ్లీ కదిలిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు డొంక

- Advertisement -

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీగలాగడంతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో డ్రగ్స్ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఈ కేసులో టాలీవుడ్, పొలికల్ లింగ్స్ బయటపడే అవకాశముంది.రేవంత్ రెడ్డి శుక్రవారం ఈడీ కార్యాలయానికి వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దర్యాప్తును కొందరు నీరుగారుస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈడీకి ఆధారాలు అప్పగించకుండా ఎక్సైజ్‌ అధికారులు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ను కలిసిన రేవంత్ రెడ్డి డ్రగ్స్‌ కేసు విచారణ పురోగతి గురించి ఆరా తీశారు. వీలైనంత త్వరగా దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసును ఈడీకి గానీ, సీబీఐకి గానీ అప్పగించాలంటూ రేవంత్ గతంలో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఆ వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాయింట్‌ డైరెక్టర్‌కు అందజేశారు. డ్రగ్స్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు.

డ్రగ్స్‌ రవాణాపై ఉక్కుపాదం మోపుతామనీ..1000 మందితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్న సీఎం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ ప్రశ్నించారు. 2017లో డ్రగ్‌ పెడలర్‌ కెల్విన్‌ అరెస్ట్‌ తర్వాత టాలీవుడ్‌లో డ్రగ్స్ లింక్‌లు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌ ఆరోపణలు కూడా వెల్లువెత్తడంతో ఈడీ కూడా విచారణలోకి ఎంటరయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -