Friday, May 3, 2024
- Advertisement -

లాంగ్ గ్యాప్‌..’నింద’తో వస్తున్న వరుణ్‌!

- Advertisement -

హ్యాపీ డేస్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అలరించారు. ఇక బిగ్ బాస్‌లోనూ సందడి చేశాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా సినిమాలకు బ్రేక్ రాగా తాజాగా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై అలరించేందుకు వస్తున్నారు. ఇక ఈ సినిమాకు నింద అనే టైటిల్ ఖరారు చేశారు.

మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇటీవల విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. తన కెరీర్‌లో ఎక్కువ‌గా ల‌వ్ స్టోరీస్ చేసిన వ‌రుణ్ సందేశ్ ఈ సారి మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీతో వస్తున్నారు.

ఇక నింద టైటిల్ పోస్టర్‌లో ఊరి వాతావరణం, ఓ చీకటి, గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి… న్యాయదేవత విగ్రహం కూడా పోస్ట‌ర్‌లో క‌నిపించగా …త‌న‌పై ప‌డిన నింద‌పై ఓ వ్య‌క్తి ఎలాంటి పోరాటం సాగించాడ‌న్నదే సినిమా స్టోరీ. రాజేష్ జగన్నాథం స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నింద మూవీని నిర్మిస్తున్నారు. వరుణ్ సందేశ్ స‌ర‌స‌న అనీ హీరోయిన్‌గా న‌టించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -