- Advertisement -

దాడి చేసింది వారే..బాధితులు వారే!

- Advertisement -

టీడీపీ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లి మేకా వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన సజ్జల..టీడీపీ నేతలే దాడులు చేసి..మ్లీ వారే బాధితలమంటూ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు.

మనుషుల ప్రాణాలను తీసేందుకు కూడా టీడీపీ వెనకాడటం లేదని …వైసీపీ వాళ్లని రెచ్చగొట్టి మరీ బైక్‌తో టీడీపీ నేతలు ఢీ కొట్టారని తెలిపారు. తాము సంయమనంతో ఉన్నామని…సీఎం జగన్‌పై జరిగిన దాడిని మర్చిపోకముందే మళ్లీ మా పార్టీ కార్యకర్తపై దాడి తెగబడ్డారన్నారు.

ఏపీకి పట్టిన టీడీపీ పీడ 20 రోజుల్లో వదులుతుందని…అనవసరంగా వివాదాలు సృష్టించవద్దని హితవు పలికారు. వైసీపీ నేతలు సంయమనం కొల్పోవద్దని… ప్రజలే వారికి తగిన బుద్ది చెబుతారని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -