Friday, May 3, 2024
- Advertisement -

విక్రమార్కుడు 2..రెడీ!

- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం విక్రమార్కుడు. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసి మంచి వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. వివిధ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కాగా అక్కడ కూడా విజయం సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ను అనౌన్స్ చేయగా ఇందుకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

విక్రమార్కుడు 2 మూవీకి స్క్రిప్ట్ పూర్తయిందని తాజాగా నిర్మాత కెకె రాధామోహన్ తెలిపారు. రైటర్ విజయేంద్ర ప్రసాద్ రెండు స్టోరీలు తయారు చేశారు. ఒకటి విక్రమార్కుడు 2. హిందీలో రౌడీ రాథోడ్ 2. తెలుగులో విక్రమార్కుడు 2. సబ్జెక్ట్ అంతా రెడీగా ఉంది. క్యాస్టింగ్ గురించి ట్రై చేస్తున్నాం అన్నారు. సరైనా క్యాస్టింగ్ దొరికితే త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుందని తెలిపారు.

ఇటీవల గోపీచంద్‌తో భీమా సినిమాను రూపొందించిన నిర్మాత కేకే రాధామోహన్ బాలీవుడ్‌లో తొలిసారిగా నిర్మిస్తున్న సినిమా రుస్లాన్. హిందీలో ఇది మా మొదటి సినిమా. ఈ సినిమా చాలా కష్టపడి అద్భుతంగా తీశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -