Saturday, May 18, 2024
- Advertisement -

వరుణ్సందేశ్, వితిక శేరు నిశ్చితార్థం ఘనంగా జరిగింది

- Advertisement -

 

ప్రముఖ తెలుగు యువ నటుడు వరుణ్ సందేశ్ నిశ్చితార్థం ముగిసింది. హైదరాబాదులోని జూబ్లిహిల్స్ క్లబ్ లో వరుణ్ సందేశ్ సినీ నటి, వితిక శేరు నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరో వ‌రుణ్ సందేశ్‌.

ఆ తర్వాత  కొత్త‌బంగారులోకం పెద్ద హిట్. ఆ తర్వాత పెద్ద హిట్ సినిమా ఏమీ లేకపోయిన అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఐతే ఈమ‌ధ్య వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన సినిమా ప‌డ్డానండీ ప్రేమ‌లో మ‌రి.

ఈ సినిమాలో వితిక శేరు హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైంది. ఇరు త‌ర‌ఫు పెద్ద‌లు పెళ్లికి అంగీక‌రించారు.

ఈ రోజు  హైద‌రాబాద్లోని జూబ్లీహిల్స్ క్ల‌బ్‌లో వివాహ‌నిశ్చితార్థ వేడుక జ‌రిగింది. ఈ నిశ్చితార్థానికి పలువురు టాలీవుడ్ యువ నటీనటులు హాజరయ్యారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -