Sunday, May 19, 2024
- Advertisement -

కోన సినిమా పోయిందని శ్రీను పార్టీ ఇచ్చాడా?

- Advertisement -

దర్శకుడు శ్రీనువైట్ల, స్టార్ రైటర్ కోన వెంకట్‌ల కాంబినేషన్‌లో ఏ రేంజ్ సినిమాలొచ్చాయో ప్రత్యేకించి చెపాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి ఇండస్ట్రీకి పలు బ్లాక్‍బస్టర్ సినిమాలను అందించారు. అయితే ‘బాద్‌షా’ సినిమా అప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవొచ్చి విడిపోయారు. 

మళ్ళీ ‘బ్రూస్ లీ’ అప్పటికి మన రామ్ చరణ్ బాబు చూపిన చొరవతో మళ్ళీ కలిశారు. కాగా అనుకోకుండా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఘోరంగా ఫెయిలై ఈ కాంబినేషన్‌కు తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టింది. ఇక ఈ విమర్శలను తనవైపు రాకుండా కోన వెంకట్ తెలివిగా శ్రీనువైట్ల మీదకు నెట్టేశాడు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన శ్రీనువైట్ల, కోన వెంకట్ అన్నీ తానై తెరకెక్కించిన శంకరాభరణం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? దాని రిజల్ట్ ఏమవుతుందా అని మన శ్రీను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చాడు. 

ఇక శ్రీనువైట్ల అనుకున్నట్లుగానే సినిమా రిలీజ్ అవ్వడం, ఆడియన్స్ చేత పూర్తి నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం జరిగిపోయింది. దీంతో శ్రీనువైట్ల సంబరాలకు అవధుల్లేవట. తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి శంకరాభరణం సినిమాకు నెగటివ్ టాక్ రావడం పట్ల పార్టీ కూడా చేసుకున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -