Thursday, May 2, 2024
- Advertisement -

వైల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తున్న హ్యాపీ డేస్ హీరో?

- Advertisement -

భారీగా అంచ‌నాల మ‌ధ్య తెలుగు బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్ ఘ‌నంగా ప్రారంభం అయింది. మొద‌టి సీజ‌న్‌తో పోలిస్తే రెండ‌వ సీజ‌న్‌లో జోష్ కాస్తా త‌గ్గిన‌ప్ప‌టికి నాని త‌న‌దైన శైలిలో షోని ముందుకు నడిపిస్తున్నాడు. షోలో ఇప్ప‌టికే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నందిని. ఇక షోలో త‌రువాత ఎలిమినేష‌న్ ఎవ‌రు అయిన వైల్డ్ కార్డు ద్వారా హీరోని తీసుకురావాల‌ని షో నిర్వహకులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే హ్యాపీ డేస్‌తో మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నా హీరో వ‌రుణ్‌ సందేశ్‌ని బిగ్‌బాస్‌లోకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

వ‌రుణ్‌ సందేశ్ సినిమాలు వ‌రసగా ఫెయిల్ కావ‌డంతో గ‌త కొంత కాలంగా సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన న‌వ‌దీప్ చేసిన రచ్చ షోకి బాగా హెల్ప్ అయింది.దీంతో రెండ‌వ సీజ‌న్‌లో కూడా ఓ హీరోని వైల్డ్ కార్డు ద్వారా షోకి తీసుకువ‌చ్చి షోకి రేటింగ్స్ పెరిగేలా చూడాల‌ని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే హీరో వ‌రుణ్‌ సందేశ్‌ని ఎంపిక చేసినట్లు స‌మాచారం. వ‌రుణ్‌ సందేశ్‌కు ప్ర‌స్తుతం సినిమాలు లేక‌పోయిన‌ప్ప‌టికి ,రెండు తెలుగు రాష్ట్ర‌ల‌కు బాగా తెలిసిన హీరో కావడంతోనే ఇత‌న‌ని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తుంది. మ‌రి వ‌రుణ్ న‌వ‌దీప్‌లా షోలో ఎంట‌ర్‌టైన్ చేస్తాడో లేదో చూడాలి.దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -