Sunday, May 5, 2024
- Advertisement -

అల్లుడు రెండో సినిమాకు ఇప్పుడు నుండే గిల్లుడు మొద‌లెట్టారా?

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీలో ఉన్నంత మంది హీరోలు మ‌రో ఫ్యామిలీలో లేరు. ఇప్పటికే ఆర‌డ‌జ‌ను హీరోలకు పైగా మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చారు.ఇక తాజాగా మ‌రో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. చిరంజీవి చిన్న‌ల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌ల్యాణ్ హీరోగా విజేత సినిమా వ‌చ్చే నెల‌లో విడుద‌ల కానుంది. అయితే మొద‌టి సినిమా విడుద‌ల కాకుండానే రెండ‌వ సినిమాకు రంగం సిద్దం చేస్తున్నారు మెగా క్యాంప్‌.

క‌ల్యాణ్ దేవ్ రెండవ సినిమా కోసం స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌ను సంప్ర‌దిస్తున్న‌ట్లు తెలుస్తుంది. కల్యాణ్ దేవ్ కోసం కథ రెడీ చేసే పనిలోనే హరీశ్ వున్నాడని అంటున్నారు. మ‌రి ఎంతైనా కుతురు భ‌ర్త కోసం చిరు స్టార్ డైరెక్ట‌ర్‌నే లైన్లో పెట్టాడని ఇండ‌స్ట్రీలో కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ఇక హ‌రీశ్ శంక‌ర్ ఇప్ప‌టి మెగా హీరోల‌తో ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. గ‌తంలో హ‌రీశ్ శంక‌ర్ ప‌వ‌న్‌,అల్లు అర్జున్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌ల‌తో సినిమాలు చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -