Wednesday, May 15, 2024
- Advertisement -

హార్ధిక్ పాండ్యాతో ప్రేమ వ్య‌వ‌హారంపై స్సందించిన బాలీవుడ్ నటి ఎల్లీ ..

- Advertisement -

టీమిండియా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతో బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్ డేటింగ్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు సోషియ‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. క్రికెటర్‌లు, బాలీవుడ్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవ‌డం స‌ర్వ‌సాధార‌నం అయ్యింది.

గత డిసెంబర్‌లో హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్య వివాహ వేడుకకు ఆమె హాజరు కావడంతో త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు కూడా వచ్చాయి. ఈ యువ జంట కలిసి ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి కూడా. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై తాజాగా ఎల్లీ స్పందించింది.

ఈ విషయం గురించి ఇప్పుడు తానేం చెప్పినా ఎవ్వరూ నమ్మరని అంటోంది భామ‌.’వాళ్లు(ప్రజలు) నా గురించి ఏమన్నా అనుకోని. వాళ్ల వూహాగానాలపై నేనెందుకు క్లారిటీ ఇవ్వాలి. నేను వివరణ ఇస్తే ఈ గాసిప్ వార్తలకు బలం చేకూర్చినట్లవుతుంది. గత కొన్నేళ్లుగా నాపై ఎన్నో తప్పుడు వార్తలు వచ్చాయి. ఆ వదంతులపై నేనెప్పుడూ స్పందించలేదు. ఎవరేమన్నా అనుకోని, వాటన్నింటిపై వివరణ ఇచ్చుకుంటూ పోలేను కదా. ఒకసారి సెలబ్రిటీ హోదా వస్తే అంతే. ఇలాంటి విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు’అని ఎల్లీ చెప్పింది. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం హార్దిక్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. వీరి ప్రేమ పెళ్లీపీట‌ల‌మీద‌కు ఎక్కుతాదో లేక మ‌ధ్య‌లో బ్రేక‌ప్ అవుతాదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -