Wednesday, May 8, 2024
- Advertisement -

వ‌రుణ్ తేజ్ ‘అంతరిక్షం’ ఫ‌స్ట్ లుక్‌

- Advertisement -

మెగా హీరో వ‌రుణ్ తేజ్ మంచి జోష్‌లో ఉన్నాడు.ఫిదా,తొలిప్రేమ హిట్లు కొట్టిన వ‌రుణ్ త‌న త‌రువాత సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాడు.తాజాగా ఆయ‌న న‌టిస్తున్న ‘అంతరిక్షం’ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్పేస్ నేప‌థ్యంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది.

ఇందులో అంతరిక్షంలో స్పేస్ సూట్ లో వరుణ్ దేనినో సీరియస్ గా పరిశీలిస్తున్నాడు. ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారీ గ్రాఫిక్స్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వరుణ్ తేజ్ సరసన అతిదిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 21న సినిమా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -