Thursday, May 9, 2024
- Advertisement -

గని విడుదల ఎప్పుడో తెలిసేది .. ఇవాళ సాయంత్రమే..!

- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గని పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ సాయి ముంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే క్లైమాక్స్ బాక్సింగ్ ఎపిసోడ్ కూడా షూట్ చేశారు. అతికొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు సాయంత్రం 5:04 నిమిషాలకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతున్నట్లు ఈ సినిమా మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావడంతో విడుదలకు సంబంధించిన అప్డేట్ తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు నార్మల్ గా ఉండడంతో తిరిగి షూటింగ్ ప్రారంభించారు.

ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం ఈ విషయమై అఫీషియల్ గా సమాచారం అందనుంది. కాగా దీపావళి రోజున సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తే సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.అలాగే అదే రోజు అజిత్ హీరోగా నటిస్తున్న వలిమై కూడా విడుదల కానుంది. గని సినిమా ఆ రెండు సినిమాలకు పోటీగా విడుదల కాబోతోంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మరో సినిమా ఎఫ్ 3 సంక్రాంతి రేసులో నిలిచిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -