అమెజాన్ ప్రైమ్ లో టక్ జగదీష్.. త్వరలో రిలీజ్ డేట్..!

- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా టక్ జగదీష్. ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. నిన్ను కోరి సినిమా హిట్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందటే పూర్తయింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా విడుదలను పలుసార్లు వాయిదా వేశారు. పలు ఓటీటీ సంస్థలు ఈ చిత్ర నిర్మాతలను సంప్రదించినా టక్ జగదీష్ మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకొని వచ్చిన ఆఫర్లను తిరస్కరించారు. అయితే తాజాగా థియేటర్లు ఓపెన్ కావడంతో ఈ సినిమా అతి త్వరలోనే విడుదల అవుతుందని అంతా భావించారు.

- Advertisement -

థియేటర్లు తెరుచుకోగానే తిమ్మరుసు, ఇష్క్ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఇష్క్ సినిమాకు ప్లాప్ టాక్ రాగా తిమ్మరుసు సినిమాకు పాజిటివ్ గానే రివ్యూస్ వచ్చాయి. అయితే కరోనా భయంతో థియేటర్లకు జనం అంతంతమాత్రంగానే వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. దీంతో థియేటర్లలో విడుదల చేయడం కంటే ఓటీటీ లోనే విడుదల చేసేది మేలని టక్ జగదీష్ నిర్మాతలు నిర్ణయించుకున్నారట.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమా మేకర్స్ ను సంప్రదించినట్లు సమాచారం. టక్ జగదీష్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ రైట్స్ ను ఏకంగా రూ.40 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా అమెజాన్ ప్రకటించనుందని సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది. గత ఏడాది కూడా కరోనా కారణంగా నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన ‘వీ’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -