వైఎస్‌ షర్మిల కీలక నిర్ణయం

- Advertisement -

రాజన్న యాదిలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మరియు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు “ఊరూరా వైయస్ఆర్ జెండా పండుగ” నిర్వహించాలని YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల నిర్ణయించారు. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ జెండా పండుగ నిర్వహించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. గ్రామాలు, మండలకేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో YSR తెలంగాణ పార్టీ జెండాలు ఆవిష్కరించాలని కోరారు.

ఆగస్టు 5వ తేదీన గురువారం YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల గారు పార్లమెంటరీ కన్వీనర్, కో-కన్వీనర్లతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించి, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త కమిటీ సభ్యులకు పార్టీ బలోపేతంపై సలహాలు ఇవ్వనున్నారు. వైయస్ఆర్ సంక్షేమ పాలనను ప్రతీ గడపకూ చేరవేసేలా నాయకులకు సూచనలు చేయనున్నారు.

- Advertisement -

వైయస్ఆర్ స్వర్ణయుగ పాలన తిరిగి తెచ్చేలా కార్యాచరణ రూపొందించనున్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, మహమ్మద్ ముస్తబా, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -