Friday, May 17, 2024
- Advertisement -

వ‌రుణ్‌పై మెగాస్టార్ ప్ర‌శంస‌ల వ‌ర్షం

- Advertisement -

‘తొలిప్రేమ’ సినీ బృందానికి స‌త్కారం

మెగా న‌టుడు వ‌రుణ్‌తేజ్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. కొణిదెల కుటుంబం గ‌ర్వ‌ప‌డేలా వ‌రుణ్ సినిమాలు చేస్తున్నాడ‌ని కొనియాడాడు. వ‌రుణ్‌తేజ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తీసిన సినిమా ‘తొలిప్రేమ’. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన విడుద‌ల విజ‌య‌వంతంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా విజ‌యం పొంద‌డంతో ‘తొలిప్రేమ’ సినిమా బృందాన్ని చిరంజీవి ప్ర‌త్యేకంగా అభినందించారు.హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 16) ‘తొలిప్రేమ’ సినీ బృందాన్ని పిలిపించుకొని ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి, హీరో వ‌రుణ్‌తేజ్‌, నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌, సంగీత దర్శకుడు తమన్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ కుమారుడు బాపినీడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తమ్ముడు పవన్‌కల్యాణ్‌ నటించిన హిట్‌ చిత్రం ‘తొలిప్రేమ’ టైటిల్‌తో వరుణ్‌ సినిమా చేశాడ‌ని ‘తొలిప్రేమ’ చూశా. పూర్తిగా సంతృప్తి చెందా. చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని హ్యాండిల్‌ చేయడం అంత సులభం కాదు. డైరెక్టర్‌ వెంకీకి ఇది ఓ ఛాలెంజ్ అని పేర్కొన్నారు. లవ్‌స్టోరీని ఓ కొత్త కోణంలో చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఫ్రెష్‌గా ఉంది. ఇందుకోసం డైరెక్టర్‌ ఎంతో హార్డ్‌వర్క్‌ చేశారు. వెంకీ లాంటి దర్శకులు ఇండస్ట్రీకి రావాలి. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు రావాల‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు. సినిమాలో నటన పరంగా వరుణ్‌లో చాలా పరిణతి వ‌చ్చింది.

డ్యాన్స్‌లు, ఫైట్స్‌ బాగా చేశాడు. మా ఫ్యామిలీ అంతా గర్వపడేలా వ‌రుణ్ నటన ఉంది. నాగబాబు గర్వపడే రోజు ఇది. ‘తొలిప్రేమ’ వంటి హిట్‌ని వరుణ్‌ ఇచ్చాడు. తమన్‌ అందించిన పాటలు డ్యాన్స్‌ చేయాలనిపించేలా ఉన్నాయి. ప్రసాద్‌గారు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా తీశారు. 65రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేయడం గ్రేట్‌. పక్కా స్క్రిప్ట్‌తో సెట్స్‌పైకి వెళ్లినప్పుడే ఇది సాధ్యం. ఇండస్ట్రీ వారంతా ఇది తెలుసుకోవాలి.‘‘సినిమాల్లో నటించాలనే ఆలోచన చిరంజీవిగారిని చూశాక వచ్చింది. మా సినిమా డాడీ (చిరంజీవి)కి నచ్చడం, ఆయన పిలిచి మరీ మా యూనిట్‌ని అభినందించడం సో హ్యాపీ అని వ‌రుణ్ ఆనందం వ్య‌క్తం చేశాడు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -