Tuesday, May 7, 2024
- Advertisement -

అంత‌రిక్షంలో.. ఇద్ద‌రు హీరోయిన్ల‌తో వ‌రుణ్‌తేజ్ రొమాన్స్‌..

- Advertisement -

ఘాజీ సినిమాతో తన సత్తా చాటిన యువ ద‌ర్శ‌కుడు సంకల్ప్ రెడ్డి త‌న త‌ర్వాతి సినిమాను మెగా న‌టుడు వ‌రుణ్‌తేజ్‌తో చేస్తున్నాడు. తొలి సినిమా మాదిరి ఈ సినిమా డిఫ‌రెంట్ స్టోరీగా తెర‌కెక్కిస్తున్నాడు. ఓ అంత‌రిక్షం నేప‌థ్యంలో సినిమా చేస్తున్నాడు. వ‌రుణ్‌తేజ్ ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్ల‌కు అవ‌కాశం ఉంది. తొలి హీరోయిన్‌గా అదితిరావు హైదరీ నటిస్తుండగా.. రెండో హీరోయిన్‌గా ఓ ఉత్తరాది భామను తీసుకున్నారు. ఆమెనే కావ్య థాపర్‌.

కావ్య ప్ర‌స్తుతం తెలుగులో ఓ సినిమా చేసినా అది ఇంకా విడుద‌ల కాలేదు. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా న‌టించిన సినిమాలో హీరోయిన్‌గా కావ్య నటించింది. ఆ సినిమా విడుద‌ల‌వ్వ‌క ముందే ఈ క్రేజీ ఆఫ‌ర్‌ను ప‌ట్టేసుకుంది. ఈ సినిమాలో కావ్య పాత్ర త‌క్కువ ఉన్నా మాత్రం చాలా కీల‌క‌మైన పాత్ర కావ‌డంతో సంక‌ల్ప్‌రెడ్డి ఆమెను ఎంపిక చేశాడంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -