- Advertisement -

రిటైర్మెంట్ యోచనలో ధోనీ……. ఆ సిరీస్‌లో రిటైర్మెంట్ ప్రకటన

- Advertisement -

క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. బిసిసిఐ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. టెస్టుల విషయంలో కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ నిర్ణయం తీసుకున్న ధోనీ ఇప్పుడు వన్డేలు, ట్వంటీ ట్వంటీల విషయంలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నాడు.

తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తన బ్యాటింగ్ పవర్‌తో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. వరల్డ్ కప్‌కి తనకే ఎక్కువ అర్హత ఉంది అని ప్రూవ్ చేసుకున్నాడు. మరోవైపు ధోనీలో మాత్రం మునుపటి పదును తగ్గింది అన్నది నిజం. అందుకే త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్‌తో తానేంటో నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. సెలక్టర్స్ కూడా ధోనీకి అదే చెప్పారట. వరల్డ్ కప్ కూడా ఇంగ్లాండ్‌లో జరగనున్న నేపథ్యంలో ధోనీ, కార్తీక్‌లు ఇద్దరూ కూడా ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడతారు. తన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ విషయంలో ధోనీ తనలో ఇంకా సత్తా ఉంది అని ప్రూవ్ చేసుకోలేకపోతే మాత్రం ధోనీకి రిటైర్మెంట్ తప్పదని బోర్డ్ వర్గాలు చెప్తున్నాయి. మరీ ముఖ్యంగా వన్డే, ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌కి తగ్గ స్పీడ్ ధోనీ బ్యాటింగ్‌లో కనిపించకపోతే మాత్రం కచ్చితంగా వరల్డ్ కప్‌కి ధోనీని పక్కన పెట్టే యోచనలో జట్టు యాజమాన్యం ఉంది. అదే సమయంలో దినేష్ కార్తీక్ ఇంగ్లండ్ టూర్‌లో కూడా గొప్పగా రాణిస్తే మాత్రం మరోసారి వరల్డ్ కప్ ఆడాలన్న ధోనీ ఆశలు పూర్తిగా అడుగంటిపోయినట్టే. ది బెస్ట్ టీం మాత్రమే ఉండాలని కోరుకుంటున్న విరాట్ కోహ్లి సారథ్యంలో తన స్థానం నిలుపుకోవాలంటే మాత్రం ధోనీ చాలా కష్టపడాల్సిందే. ఇంగ్లండ్‌లో విఫలమయితే తనంతట తానే తప్పుకునే యోచనలో ధోనీ కూడా ఉన్నాడని టీం వర్గాలు చెప్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -