Saturday, April 27, 2024
- Advertisement -

వ‌రుణ్‌కు ‘ఫిదా’ను మించిన ‘తొలిప్రేమ’

- Advertisement -

విభిన్న సినిమాలు చేసుకుంటూ వరుణ్‌తేజ్ వ‌రుస హిట్లు పొందుతున్నాడు. గ‌తంలో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వరుణ్‌ నటించిన ‘ఫిదా’ సినిమా హిట్ నిల‌వ‌గా ఆ సినిమాకు మించి ‘తొలిప్రేమ’ బాక్సాఫీస్‌ వద్ద క‌లెక్ష‌న్లు కురిపిస్తోంది. ఈ సినిమా అమెరికా బాక్సాఫీసు వద్ద మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో అడుగుపెట్టేసింది. ‘ఫిదా’ తర్వాత ఆయన సినీ కెరీర్‌లో మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిన రెండో సినిమా ఇది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందించిన ‘తొలిప్రేమ’ సినిమా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన విడుద‌లైనా ఇంకా థియేట‌ర్లు నిండి ఉన్నాయి. ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీగా సినిమా ఉండ‌డంతో 50 రోజుల దిశ‌గా సినిమా దూసుకుపోతోంది. అయితే ఈ మేర‌కు క‌లెక్ష‌న్లు కూడా భారీగా వ‌స్తున్నాయి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొని మౌత్‌టాక్‌తో విజ‌య‌వంతంగా ఆడుతోంది. ఈ సినిమాలో వ‌రుణ్ ప‌క్క‌న రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

ప్ర‌స్తుతం వరుణ్‌ ‘ఘాజీ’ ద‌ర్శ‌కుడు సంకల్ప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అంతరిక్ష నేపథ్యంలో ఈ సినిమా ఉండే అవ‌కాశం ఉంది. మ‌రికొన్ని సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -