సినిమా కోసం 200 కాస్టూమ్స్ వేసుకున్న హీరోయిన్‌

- Advertisement -

‘నేను శైల‌జ‌’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేశ్ ప్ర‌స్తుతం వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ఆమెకు సినిమా అవ‌కాశాలు వ‌రుస క‌డుతున్నాయి. ఇప్ప‌టికే ‘భైరవ’, ‘నేను లోకల్‌’, ‘అజ్ఞాతవాసి’ సినిమాల‌తో హిట్ అందుకున్న కీర్తి సురేశ్ ఇప్పుడు మ‌రికొన్ని సినిమాల‌తో బిజీ అయ్యింది. అయితే న‌ట‌న‌కు వంక పెట్ట‌లేని హీరోయిన్‌.. తెలుగుద‌నానికి చిరునామాగా ఉన్న న‌టి సావిత్రి జీవిత చరిత్ర‌పై తీస్తున్న సినిమా ‘మహానటి’లో నటించే అవకాశం పొందింది.

అందులో ఏకంగా సావిత్రి పాత్ర‌లో న‌టించే అవ‌కాశం రావ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆ పాత్ర‌లో కీర్తి ఒదిగిపోయింది. ఈ సినిమా గురించి ఓ మీడియాతో మాట్లాడింది. ఈ సినిమా అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు సావిత్రి గారి గురించి విన్నా. కానీ ఆ ప్రాజెక్టుపై సంతకం చేసిన తర్వాత కానీ, సావిత్రి గారు ఎవ‌రో, ఆమె ఏంటో, ఆమె నటనా విశ్వరూపమేంటో తెలిసింది. చాలా తొందరగా సావిత్రి లాంటి పాత్రను, సినిమాను చేస్తున్నానా? అని త‌న‌ను తాను ప్ర‌శ్నించుకుంద‌ని తెలిపింది.

- Advertisement -

అయితే ‘మహానటి’ సినిమా గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు. ఈ సినిమా చాలా పెద్ద ప్రాజెక్టుగా తాను భావిస్తున్నాన‌ని చెప్పారు. ఈ సినిమాలో 120 రకాల కాస్ట్యూమ్స్ వేసుకుందంట‌. మామూలుగా అయితే హీరోయిన్‌కు 30 కాస్ట్యూమ్‌లకు మించి ఉండవు. కానీ ఆ సినిమాలో అన్ని కాస్టూమ్స్ వేసుకొని సావిత్రిలాగ క‌నిపించేందుకు తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డాన‌ని చెప్పారు. ఈ సినిమాలో సావిత్రి గారి యంగ్ లుక్ కోసం బాగా బ‌రువు త‌గ్గి పాత్ర‌లో ఒదిగాన‌ని తెలిపారు.

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ‘మహానటి’ సినిమా మార్చి 28వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత‌, శాలినీ పాండే, విజ‌య్ దేవ‌ర‌కొండ త‌దిత‌రులు ప్రధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -