Thursday, May 9, 2024
- Advertisement -

వరుణ్ తేజ్ సూపర్బ్…… తొలిప్రేమ ట్రైలర్ ఎలా ఉందంటే?

- Advertisement -

డిస్ట్రిబ్యూటర్‌గా చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న దిల్ రాజు ఒక సినిమాను అవుట్‌రేట్‌కి అన్ని ఏరియాలకు కొనేశాడంటేనే ఆ సిినిమాలో ఏదో విషయం ఉంది అన్న నమ్మకం సినిమా ఇండస్ట్రీ జనాలకు వచ్చేస్తుంది. కానీ రీసెంట్ టైమ్స్‌లో దిల్ రాజు ట్రాక్ రికార్డ్‌లో స్పైడర్, అజ్ఙాతవాసి లాంటి సినిమాలు ఉండడంతో అందరూ అనుమానంగా చూశారు. కానీ ఆ అనుమానాలన్నింటినీ ట్రైలర్‌తో పటాపంచలు చేసింది తొలిప్రేమ. తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌లో మెయిన్ అస్సెట్ వరుణ్ తేజ్‌నే. ముకుంద సినిమాతోనే తానేంటో నిరూపించుకున్న వరుణ్ తేజ్ కంచెతో చాలా మెట్లే ఎక్కేశాడు. కానీ ఆ తర్వాత తిన్న ఎదురుదెబ్బలు మనవాడ్ని కాస్త డల్ చేశాయి. అయితే ఫిదాలాంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో స్ట్రాంగ్‌గా బౌన్స్ అయ్యాడు వరుణ్ తేజ్. ఆ కాన్ఫిడెన్స్ మొత్తం తొలిప్రేమ ట్రైలర్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన వీడియో సాంగ్స్ ఆల్బమ్స్‌లో వరుణ్ డ్యాన్సులు చూసి మెగా ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా ఫిదా అయిపోయారు. ఇప్పుడు ట్రైలర్‌లో తన యాక్టింగ్ టాలెంట్‌ని కూడా కంప్లీట్‌గా ఆవిష్కరించాడు వరుణ్.

వరుణ్ తేజ్‌ చేత సూపర్బ్ పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్న డైరెక్టర్ మిగతా విషయాల్లో కూడా మంచి అవుట్ పుట్ అందించాడు. రాశిఖన్నా సినిమాకు ప్లస్ అయ్యేలానే ఉంది. వరుసగా మాస్ సినిమాలు చేసిన రాశిఖన్నా‌ని క్యూట్, లవబుల్ అమ్మాయిగా యువ ప్రేక్షకులు ఆదరించారంటే మాత్రం సినిమా కచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్. మొత్తంగా ట్రైలర్‌లో కనిపించిన ప్రతి షాట్ కూడా బాగుంది. లవ్ స్టోరీని ఎంటర్టైన్ చేస్తూ చెప్పబోతున్నానన్న నమ్మకాన్ని ఇచ్చాడు డైరెక్టర్. కొత్త సంవత్సరంలో సరైన హిట్స్ లేక ఇబ్బందిపడుతున్న ఇండస్ట్రీకి తొలిప్రేమతో ఒక మంచి హిట్ పడుతుందేమో చూడాలి. ఫిదా తరహాలో ఫన్నీ, ఎమోషనల్ లవ్ స్టోరీని చూడాలనుకునే ప్రేక్షకులను మాత్రం తొలిప్రేమ కచ్చితంగా మెప్పించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -