Saturday, May 4, 2024
- Advertisement -

ఒకే వ‌న్డేలో ఇద్ద‌రు కెప్టెన్‌లు సెంచ‌రీలు…

- Advertisement -

ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లి మరోసారి సఫారీ గడ్డపై జూలు విదిల్చాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ కోహ్లి (112: 119 బంతుల్లో 10×4) శతకం బాదడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింన‌సంగ‌తి తెలిసందే.

అయితే వన్డే క్రికెట్‌ చరిత్రలో మరో కొత్త అధ్యాయం లిఖించబడింది. ఇందుకు వేదిక‌ టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డర్బన్‌లో జరిగిన తొలి వన్డేనే . మొద‌టి వ‌న్డేలో ఇరు జ‌ట్ల కెప్టెన్లు సెంచ‌రీలు చేశారు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌(120) ముందుగా సెంచరీ చేయగా, టీమిండియా కెప్టెన్‌(112) శతకం సాధించాడు. ఫలితంగా ఒకే వన్డేలో శతకాలు చేసిన కెప్టెన్లుగా డుప్లెసిస్‌-కోహ్లిలు రికార్డులుకెక్కారు. ఓవరాల్‌గా చూస్తే ఒకే వన్డేలో ఇరు జట్ల కెప్టెన్లు సెంచరీలు చేయడం ఈ ఫార్మాట్‌ చరిత్రలో నాల్గోసారి మాత్రమే.

2013లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, ఐర్లాండ్‌ కెప్టెన్‌ విలియమ్‌ పోర్టర్‌ ఫీల్డ్‌లు శతకాలు సాధించారు. తద్వారా తొలిసారి ఒకే వన్డేలో శతకాలు సాధించిన కెప్టెన్లుగా వీరిద్దరూ రికార్డు పుస్తకాల్లో కొత్త చరిత్ర లిఖించారు.

రెండోసారి 2014లో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ ముష్పికర్‌ రహీమ్‌, భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు శతకాలు సాధించారు. దాంతో ఏడాది వ్యవధిలోనే ఒకే మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు మూడంకెల మార్కును చేరిన ఘనతను కోహ్లి-రహీమ్‌లు సొంతం చేసుకున్నారు.

మూడో సారి 2014లో భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి-శ్రీలంక కెప్టెన్‌ ఏంజెలో మాథ‍్యూస్‌లు సెంచరీలు నమోదు చేశారు. రాంచీలో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ శతకాలు సాధించారు.

తాజా నాలుగోసారి డ‌ర్బ‌న్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డు ప్లెసిస్‌-భారత కెప్టెన్‌ కోహ్లిలు శతకాలతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు సందర్బాల్లో మూడుసార్లు భారత కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి భాగస్వామ్యం కావడం ఇక్కడ మరో విశేషం. క్రికెట్ చ‌రిత్ర‌లో రికార్డులు నెల‌కొల్ప‌డం సాధార‌న‌మే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -