Saturday, May 11, 2024
- Advertisement -

ధోనీ సాయంతోనే డుమినీ వికెట్ ప‌డ‌గొట్టా కుల్దీప్ యాద‌వ్‌…

- Advertisement -

దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి వన్డేలో భార‌త్ 6 వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. బౌల‌ర్లు అద్భుతంగా రాణిస్తే బ్యాట్స్‌మేన్‌లు దుమ్ములేపారు. కెప్టెన్ కోహ్లీ శ‌త‌కంతో క‌దం తొక్కారు. కుల్దీప్ యాద‌వ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టి స‌ఫారీ వెన్ను విరిచారు.

వికెట్లు తీయ‌డం వెనుక ధోనీ స‌ల‌హానేన్నారు కుల్దీప్ యాద‌వ్‌. ధోనీ సాయంతోనే జేపీ డుమిని‌ వికెట్‌‌ని కుల్దీప్ యాదవ్ పడగొట్టినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. డర్బన్ వేదికగా జరిగిన ఈ వన్డేలో కుల్దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. సఫారీ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జేపీ డుమినీని బోల్తా కొట్టించిన విధానం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

స్పిన్నర్లని ఎదుర్కోవడంలో మంచి నైపుణ్యం ప్రదర్శించే డుమిని.. కుల్దీప్ విసిరిన గూగ్లీని అర్థం చేసుకోలేక క్లీన్‌ బౌల్డయ్యాడు. వికెట్ల వెనుక నుంచి కుల్దీప్‌తో పాటు చాహల్‌కి కూడా వరుసగా సూచనలు చేస్తూ వచ్చిన ధోనీ.. ఈ స్పిన్నర్లు విసిరిన కొన్ని బంతుల్ని అందుకోలేకపోయాడు. డుమిని క్లీన్ బౌల్డవగానే ‘నాలానే జేపీ డుమని కూడా బంతిని అందుకోలేకపోయాడు’ అని వికెట్ల వెనుక ధోనీ అరవడం స్టంప్‌ మైక్‌లో రికార్డైంది.

మహేంద్రసింగ్ ధోనీ‌‌‌ వికెట్‌ కీపర్‌గా ఉన్న సమయంలో బౌలర్లు ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. ప్రత్యర్థి వికెట్ పడగొట్టేందుకు బౌలర్ 40 శాతం కష్టపడితే చాలు.. మిగిలిన 60 శాతం ధోనీనే చూసుకుంటాడు. ఎందుకంటే.. క్రీజులోని బ్యాట్స్‌మెన్‌ ఆలోచల్ని చదవడంలో అతనో దిట్ట. ఎవరు బౌలింగ్ చేస్తున్నా.. ధోనీ నుంచి ఆ సహకారం ఉంటుంది’ అని కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ 34 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టడంతో.. దక్షిణాఫ్రికా 269/8కే పరిమితమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -