Sunday, May 19, 2024
- Advertisement -

భోజ్‌పూరిలో సినిమా అచ్చం బాహుబ‌లిలాగే

- Advertisement -

రీమేక్‌పై స్ప‌ష్ట‌తనివ్వ‌ని సినిమా బృందం

బాహుబ‌లి సినిమాలు తెలుగు సినీ స‌త్తాను ప్ర‌పంచానికి చాటి చెప్పాయి. ఈ సినిమా దేశ‌వ్యాప్తంగా విడుద‌లై భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది. ఈ సినిమా తెలుగు, త‌మిళ్‌, హిందీ, మ‌ల‌యాళం ఇంకా ప‌లు భారతీయ భాష‌ల్లో విడుద‌లై వ‌సూళ్ల వ‌ర‌ద వ‌చ్చేసింది. అయితే ఈ సినిమాను భోజ్‌పూరిలో రీమేక్ అవుతోంది. భోజ్‌పూరి నటుడు దినేశ్‌లాల్‌ యాదవ్‌ నిరహువా హీరోగా నటిస్తున్న సినిమా ‘వీర్‌ యోధ మహాబలి’, అమ్రపాలి డుబే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవ‌ల విడుదల చేశారు.

అయితే దీనిపై సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌లో మాట్లాడారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ్‌, బెంగాళీ, భోజ్‌పూరి భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఇక్బాల్‌ బక్ష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండ‌గా ఎం. రమేశ్‌ వ్యాస్‌ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తెలుగు బ్లాక్‌బస్టర్‌ ‘బాహుబలి’కి రీమేక్‌గా ఈ సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ చూస్తుంటే రీమేక్‌గానే క‌నిపిస్తోంది. ప్ర‌పంచం మొత్తం చూసిన త‌ర్వాత కూడా ఈ సినిమాను రీమేక్ చేయ‌డానికి ఎందుకు సాహ‌సం చేస్తున్నారో తెలియ‌డం లేదు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -