Tuesday, May 21, 2024
- Advertisement -

ప్యాడ్‌మ్యాన్ హిట్‌.. త్వ‌ర‌లో మిల్క్‌మ్యాన్‌

- Advertisement -

మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న చెప్పుకోలేని స‌మ‌స్య‌పై ‘ప్యాడ్‌మ్యాన్‌’గా అక్ష‌య్‌కుమార్ ఓ ప‌రిష్కారం చూపించాడు. అయితే ఇది య‌దార్థ గాధ‌. ఓ వ్య‌క్తి చేసిన కృషిని ప్ర‌శంసిస్తూ ఈ సినిమా రూపొందించారు. రుతుక్ర‌మం స‌మ‌స్య‌పై అక్షయ్‌కుమార్ సినిమా వ‌చ్చి విజ‌య‌వంతంగా దూసుకెళ్తున్నాడు. అయితే ప్యాడ‌మ్యాన్ మాదిరి త్వరలో మిల్క్‌మ్యాన్‌గా కనిపించనున్నాడని సమాచారం.

దేశంలో పాల దిగుబడి కోసం విశేష కృషి చేసిన వర్గీస్‌ కురియన్‌ జీవిత కథలో అక్షయ్‌కుమార్‌ నటించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాయి. ‘ఐ టు హేడ్‌ ఎ డ్రీమ్‌’ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నారు. ‘టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ’, ‘బట్టీ గుల్‌ మీటర్ చాలు’ సినిమాల‌ దర్శకుడు శ్రీ నారాయణ్‌సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నార గుస‌గుస‌లు వినిపిస్తోంది. ఏక్తా కపూర్‌ ఈ సినిమాను నిర్మించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -