Sunday, May 19, 2024
- Advertisement -

వీరభోగ వసంత రాయల నుంచి శ్రీవిష్ణు స్టన్నింగ్ ఫస్ట్‌లుక్..

- Advertisement -

ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై కూడా మల్టీ స్టారర్ సినిమాల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. జ‌క్కన్న డైరెక్స‌న్‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం సెట్స్ పై వున్న మల్టీ స్టారర్ చిత్రాల జాబితాలో ‘వీర భోగ వసంత రాయలు’ ఒకటిగా కనిపిస్తోంది. ఇంద్రసేన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రీవిష్ణు .. శ్రియ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.

నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో హిట్‌ను సొంతం చేసుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాతో వస్తున్నాడు. ఇతడితో పాటు నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ శరణ్‌లు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌ లుక్ విడుదల అయ్యింది.

డిఫరెంట్ గెటప్‌లో ఉన్న శ్రీవిష్ణు పోజునే ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా.. ఫాంటసీ లుక్‌ను విడుదల చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో హీరో రాయల్ లుక్‌కు తోడు పక్కనే ఉన్న గుర్రం తో పోస్టర్ డిజైనింగ్ ఆసక్తిదాయకంగా మారింది. ఈ సెటప్ అంతా ఫాంటసీ లుక్ తీసుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -