Sunday, May 12, 2024
- Advertisement -

కాపుల‌కు సంచ‌ల‌న హామి ఇచ్చిన జ‌గ‌న్‌..

- Advertisement -

నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచక పాలన చూశారని ఆయన అన్నారు. తనకు గత ఎన్నికల్లో అండగా నిలిచిన నియోజకవర్గం ఇదని ఆయన అన్నారు. అందువల్ల ఈ నియోజకవర్గాన్ని తాను మరిచిపోలేనని అన్నారు. తమ పార్టీ కూడా ఇక్కడే పుట్టిందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేస్తూ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన నియోజకవర్గం కూడా అని అన్నారు.

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను బాబు ఏ ఒక్క‌దాన్ని పూర్తిగా అమ‌లు చేయ‌లేద‌న్నారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వ ప‌రిధిలో లేని కాపు రిజ‌ర్వేష‌న్ల హీమి ఇచ్చార‌ని దాన్ని ఇప్ప‌టి వ‌ర‌కూ నెర‌వేర్చ‌లేద‌న్నారు. కాపుల‌కు ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని కాపు నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పోరాటం చేస్తే ఆయ‌న కుటంబ స‌భ్యుల‌ను ఎలా వేధించారో అంద‌రం చూశామ‌న్నారు.

వైసీపీ అధికారంలోకి వ‌స్తే కాపుల‌కు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇవ్వలేనని, తాను బాబులాగా అబ‌ద్దాలు చెప్ప‌డం చేత‌కాద‌న్నారు. నేను చేయ‌గ‌లిగింది మాత్ర‌మే చేస్తాన‌న్నారు. రిజ‌ర్వేష‌న్ల అశం రాష్ట్ర‌ప‌రిధిలో ఉండ‌ద‌ని అది కేంద్రం ప‌రిధిలో ఉంటుంద‌న్నారు.

నేను నెర‌వేర్చే హామీల‌నే ఇస్తాన‌ని.. అమ‌లు చేయ‌లేని హామీలు ఇవ్వ‌లేన‌న్నారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌లేన‌ని కార్పొరేష‌న్‌కు బాబు కేటాయించిన నిధుల‌కంటే రెట్టింపు నిధులు కేటాయిస్తాన‌ని సంచ‌ల‌న హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, రిజర్వేషన్ల కోటా యాభై శాతం దాటితే అమలు చేయలేమని ఆయన చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -