Saturday, April 20, 2024
- Advertisement -

ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌లో సీనియ‌ర్ హీరో, కుర్ర హీరో

- Advertisement -

భిన్న‌మైన సినిమాలు రూపొందిస్తూ హిట్లు కొడుతున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఇటీవ‌ల ‘రాజా ది గ్రేట్‌’ సినిమాతో హిట్ పొందిన దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి వెంక‌టేశ్‌, యువ న‌టుడు వ‌రుణ్‌ తేజ్‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘ఎఫ్ 2’ అని టైటిల్ ఫిక్స్ చేసి శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఆదివారం (మార్చి 25) టైటిల్ లోగో విడుద‌ల చేశారు.

హీరో వరుణ్ తేజ్‌ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించాడు. ‘ఎఫ్ 2’ అంటే (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్) అని అర్థం. అవుట్ అండ్‌ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుతున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను వెంకీ, వరుణ్ త‌మ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి ఈ సినిమాకు డేట్స్ ఇవ్వ‌నున్నారు. ప్రస్తుతం వ‌రుణ్ ఘాజీ ద‌ర్శ‌కుడు సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌లో సినిమా చేస్తుండ‌గా, వెంకటేశ్‌ తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -