Friday, May 10, 2024
- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌తో ముఖ్యనేత కుమారుడి రాసలీలల ఫొటోలు బిజెపి నేతలకు చిక్కాయా?

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రధాన రాజకీయ కుటంబం అది. ముఖ్యనేతగా ఆ కుటుంబ అధినేత ఓ వెలుగు వెలిగిపోతున్నారు. ఇక ఆయన కుమారుడు కూడా మంత్రి వర్యులుగా వెలగబెడుతున్నారు. భజన మీడియా మొత్తం ఆ యువ నాయకుడికి జాకీలేసి ఆయన సమర్థత గురించి చెప్తూ ఉంది. అయితే ఆయనగారి రాసలీలల ఫొటోలు మాత్రం మొత్తం కుటుంబ పరువునే బజారుకీడ్చాయి. అంతకుముందు వరకూ పిల్లలను ఎలా పెంచాలి? ప్రత్యర్థి నాయకుడి తల్లిదండ్రులకు పిల్లలను పెంచడం రాలేదు అంటూ కొన్ని విమర్శలు గుప్పించిన ముఖ్యనాయకుడు మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకుండా షటప్ అయిపోవడానికి కారణం పుత్రరత్నం రాసలీలలే అన్నది ఆ పార్టీ నాయకుల అంతర్గత సంభాషణల్లో తెలుస్తున్న విషయం.

ఆ విషయాలు పక్కనపెడితే మామూలుగా అయితే ఆ పార్టీకి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ ఆ ముఖ్యనాయకుడి కుమారుడు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాడు. అయితే రీసెంట్ బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం….ఇతర విషయాల్లో మాత్రం ఆయన వాయిస్ చాలా తక్కువగా వినిపిస్తోంది. ఎందుకా అని చెప్పి ఆరా తీసిన ఆ పార్టీ నేతలకు, మీడియా వర్గాలకు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆ యువ నాయకుడు ఒక టాప్ హీరోయిన్‌తో సాగించిన రాసలీలల వ్యవహారాలకు సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు బిజెపి నాయకుల దగ్గర ఉందట. ఆ విషయం తెలిసిన ముఖ్యనాయకుడు వెంటనే ఆ పార్టీకి చెందిన ఒక ఎంపిని బిజెపి పెద్దల దగ్గరకు రాయబారం పంపించాడట. బిజెపి జనాల బ్లాక్ మెయిలింగ్ నుంచి కాపాడమని ఆ పార్టీ పెద్దలకు విన్నపాలు చేసుకున్నారట. అయితే బిజెపి పెద్దలు పెట్టిన కండిషన్స్ ఏంటి…..ఈ సన్నిహిత ఫొటోలు బయటకు రాకుండా చేయడానికి ముఖ్యనేత ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు లాంటి విషయాలు మాత్రం ఏవీ తెలియరాలేదు. అయితే ముఖ్యనాయకుడు, ఆయన కుటుంబం మొత్తాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకోవడంలో మాత్రం బిజెపి సక్సెస్ అయినట్టే అన్నది విశ్లేషకుల మాట. ప్రజలను నమ్మించడం కోసం పైకి ఎన్ని వేషాలు వేసినా, డ్రామాలు ఆడినా ఫైనల్‌గా మాత్రం ఆ నాయకుడు, ఆయన కుటుంబం ఎప్పుడూ బిజెపికి తలొగ్గే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆ పార్టీ నాయకులే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -